Mithun Chakraborty | సినీ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ (Dadasaheb Phalke Award) ఎంతో ప్రధానమైనది. ఈ ఏడాది ఈ అవార్డును ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)కి వరించింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు మిథున్ చక్రవర్తి ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. వచ్చే నెల అంటే అక్టోబర్ 8న జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నట్లు వెల్లడించింది.
మిథున్ చక్రవర్తి 1976లో సినీ ప్రస్థానం ప్రారంభించారు. నటుడిగా, నిర్మాతగా సేవలందించారు. ‘డిస్కో డాన్సర్’ చిత్రం ద్వారా విశేష ప్రేక్షకాదరణ పొందారు. ఇప్పటికే పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇక సినీ రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ ఏడాది జనవరిలో ఆయనకు పద్మభూషణ్ అవార్డును కూడా అందజేసింది. ఇప్పుడు దాదా సాహెబ్‌తో సత్కరించనుంది.
Also Read..
NPS | ఎన్‌పీఎస్‌లో సరైన ప్లాన్ ఏది? ఎలా ఎంచుకోవాలి?
Bhadradri Kothagudem | ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలింతపై కత్తితో దాడి
KTR | ఎందుకు మీ పాలన.. కొంచెం కూడా సిగ్గు అనిపిస్త లేదా.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్