మీ రిటైర్మెంట్ అనంతరం ఆనందకర జీవితాన్ని సొంతం చేసుకోవడానికున్న చక్కని ఆర్థిక సాధనాల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఒకటి. అయితే ఇందులో తగిన యాన్యుటీ ప్లాన్‌ను ఎంచుకొనే బాధ్యత మాత్రం పెన్షనర్దే. ఎన్పీఎస్ 2024 హ్యాండ్‌బుక్ వివరాల ప్రకారం 2004 జనవరి 1న ఈ స్కీం ప్రారంభమైన దగ్గర్నుంచి పదవీ విరమణ సమయంలోనే 1,65,320 మంది యాన్యుటీ ప్లాన్లను ఎంచుకున్నట్టు తేలింది.
NPS | ప్రస్తుతం ఎన్పీఎస్ సబ్‌స్ర్కైబర్ల కోసం 15 రకాల యాన్యుటీ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, కొటక్ మహీంద్రా లైఫ్, మ్యాక్స్ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్, ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ తదితర 15 జీవిత బీమా సంస్థలు యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్లుగా పనిచేస్తున్నాయి. యాన్యుటీ రేట్లు, ఆప్షన్స్నుబట్టి ఈ ప్లాన్లు మారుతూ ఉంటాయి. ప్రస్తుతమున్న యాన్యుటీ ప్లాన్లలో ఐదు రకాలే పాపులర్. వాటిలో యాన్యుటీ ఫర్ లైఫ్ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్, జాయింట్ లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్, ఎన్పీఎస్-ఫ్యామిలీ ఇన్కమ్ ఆప్షన్ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్, యాన్యుటీ ఫర్ లైఫ్ వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్, జాయింట్ లైఫ్ యాన్యుటీ వితౌట్ రిటర్న్ పర్చేజ్ ప్రైస్.
ఎంచుకోండిలా..
యాన్యుటీ ఫర్ లైఫ్ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్‌లో సబ్స్రైబర్కు జీవితాంతం యాన్యుటీ వస్తుంది. ఒకవేళ చనిపోతే ఇది ఆగుతుంది. నామినీకి ప్లాన్ కొన్న ధరలో 100 శాతం తిరిగొస్తుంది.
జాయింట్ లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్‌లో సబ్స్రైబర్కు జీవితాంతం యాన్యుటీ వస్తుంది. ఒకవేళ చనిపోతే వారి భాగస్వామికి వస్తుంది. వీరూ చనిపోతే నామినీకి ప్లాన్ కొన్న ధర మొత్తం తిరిగొస్తుంది.
ఎన్పీఎస్-ఫ్యామిలీ ఇన్కమ్ ఆప్షన్ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్‌లో సబ్స్ర్కైబర్కు, వారు చనిపోతే వారి భాగస్వామికి, వీరూ చనిపోతే సబ్‌స్ర్కైబర్ మీద ఆధారపడ్డ తల్లిదండ్రులకు యాన్యుటీ చెల్లింపులు జరుగుతాయి. వీరి తదనంతరం సబ్‌స్ర్కైబర్ పిల్లలు లేదా లీగల్ వారసులకు ప్లాన్ కొన్న ధరను మొత్తంగా చెల్లించడం జరుగుతుంది. యాన్యుటీ ఫర్ లైఫ్ వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్‌లో సబ్‌స్ర్కైబర్ జీవించి ఉన్నంత వరకే యాన్యుటీ వస్తుంది. చనిపోతే భాగస్వామికి, నామినీలకూ రాదు. జాయింట్ లైఫ్ యాన్యుటీ వితౌట్ రిటర్న్ పర్చేజ్ ప్రైస్‌లో సబ్‌స్ర్కైబర్, వారి భాగస్వామి జీవించి ఉన్నంతదాకా యాన్యుటీ వస్తుంది. వీరు చనిపోతే నామినీలకు ఏమీ రాదు. వీటన్నింటిలో మనకు ఏది ఉత్తమం అనుకుంటే దాన్ని ఎంచుకోవడం లాభదాయకం.
ఇవి గుర్తుంచుకోండి..