భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై(Woman) గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి(Knife attack )చేసి పారిపోయాడు. ఈ విషాదకర సంఘటన జూలూరుపాడు మండలం మాచినపేటలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బానోత్ నందిని(Banoth Nandini) అనే మహిళ తన మూడు నెలల పాపతో ఇంట్లో ఉంది.
ఇదే సమయంలో ఓ అగంతకుడు ఇంట్లోకి జొరబడి నీ భర్త వీరభద్రం ఎక్కడ అని ప్రశ్నిస్తూనే కత్తితో తలపై గాయపరిచాడు. నందిని గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు ఆమెను రక్షించారు. హెల్మెట్ ధరించి ఉన్న దుండగుడు తన మోటార్ బైక్పై అక్కడి నుంచి పారిపోయి కొత్తగూడెం వైపు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.