Rana Daggubati | టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి (Rana Daggubati) ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న వెట్టైయాన్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా అక్టోబర్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. అంతేకాదు ఇటీవలే రానా సమర్పణలో 35 చిన్న కథ కాదు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇదిలా ఉంటే నటుడిగా రానా క్రేజీ ప్రాజెక్ట్‌కు సంతకం చేశాడన్న వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం బాహుబలి ప్రాంఛైజీ మేకర్స్ (Baahubali makers)తో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ఇన్సైడ్ టాక్.
సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ (supernatural thriller)గా రాబోతున్న ఈ చిత్రంలో రానా ఘోస్ట్‌గా కనిపించబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమా నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం. మొత్తానికి బాహుబలి మేకర్స్‌తో రానా ఈ సారి ఎలాంటి కథ చేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. కెరీర్ తొలినాళ్ల నుంచే ఆసక్తికర ప్రయోగాత్మక పాత్రలతో సినిమాలను ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు రానా. ఈ సారి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌తో మరో ప్రయోగం చేసస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు.
Zebra | సత్యదేవ్‌కు సపోర్ట్‌గా నాని.. జీబ్రా టీజర్ టైం చెప్పేశారు
Bhaagamathie 2 | భాగమతి మళ్లీ వచ్చేస్తుంది.. అనుష్క భాగమతి 2పై డైరెక్టర్ అశోక్ క్లారిటీ
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?