హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. డెహ్రడూన్‌లో గల కాలేజీలో 8వ తరగతిలో అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 7న పరీక్ష జరుగుతుంది. నోటిఫికేషన్ కోసం scert. telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని, సందేహాల నివృత్తికి 85208 66771 నంబర్‌ను సంప్రదించాలి.
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) చైర్మన్ జస్టిస్ ఏ గోపాల్‌రెడ్డి పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీకాలం ఫిబ్రవరి 4తో ముగిసింది. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన్ను చైర్మన్‌గా కొనసాగిస్తూ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.