ఇటీవలే ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు శర్వానంద్. ఆయన తాజా చిత్రం ‘బైకర్’ ఏప్రిల్‌లో విడుదలకానుంది. ఇదిలావుండగా సీనియర్ దర్శకుడు శ్రీనువైట్ల నిర్ధేశకత్వంలో శర్వానంద్ ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. యాక్షన్ కామెడీ జోనర్ కథాంశమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నట్లు తెలిసింది. జూన్ నెలలో షూటింగ్‌ను మొదలుపెట్టి, వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అనంతిక సనిల్‌కుమార్ కథానాయికగా నటించే అవకాశముంది.