US Airstrike | సిరియాపై అమెరికా వైమానిక దాడులు.. 37 మంది ఉగ్రవాదులు హతం..!
US Airstrike | సిరియాలో అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదాకు చెందిన 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పలు ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.
US Airstrike | సిరియాలో అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదాకు చెందిన 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పలు ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. వాయువ్య సిరియాపై దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇందులో అల్‌ఖైదాతో అనుబంధం ఉన్న హుర్రాస్ అల్ దిన్ గ్రూప్ అగ్రనేతతో పాటు మరో ఎనిమిదిపై దాడి చేసినట్లు జరిగినట్లు తెలిపింది. టాప్ ఉగ్రవాది స్థానిక ఉగ్రవాద కార్యకలాపాలకు పర్యవేక్షిస్తుంటాడని చెప్పింది. అలాగే, సెంట్రల్ సిరియాలోని ఐసిస్ శిక్షణా శిబిరంపై సైతం సైనిక దాడి చేసినట్లు తెలిపింది. ఈ ఘటనలో 28 మంది హతమయ్యారని.. ఇందులో నలుగురు సిరియా నేతలు ఉన్నారని చెప్పింది.
అమెరికా ప్రయోజనాలతో పాటు మిత్రదేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలను అడ్డుకునేందుకు వైమానిక దాడి నిర్వహించినట్లు చెప్పుకొచ్చింది. దాదాపు 900 మంది అమెరికా సైనికులను సిరియాలో అమెరికా మోహరించింది. యూఎస్ దళాలు ఈశాన్య సిరియాలోని కుర్దిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ దళాలకు సలహాలు ఇవ్వడంతో పాటు సహాయం చేయనున్నాయి. ఇప్పటికే గాజా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు దిగుతున్నది. దీంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్, ఇజ్బొల్లాను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నది. తాజాగా అమెరికా సైతం సిరియాపై దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- ISIS
- Syria
- Telugu News
- US Airstrike
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

