KTR | హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఢిల్లీలో ఉన్న బీజేపీ కూడా కాపాడడం కష్టమే.. ఆయన రాజీనామా చేయక తప్పదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
బామ్మర్దితో లీగల్ నోటీసు పంపితే.. నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడడం బంద్ చేస్తా అనుకుంటున్నావా..? అని కేటీఆర్ అడిగారు. బామ్మర్దికి అమృతం పంచి.. పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోమని తేల్చిచెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన డిపార్ట్మెంట్లోనే ఆయన బామ్మర్ది శోద కంపెనీకి రూ. 1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది ముమ్మాటికీ నిజం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉల్లంఘించిన మాట నిజం. శోద అనే కంపెనీ గత రెండు సంవత్సారాలుగా రెండు కోట్ల రూపాయాలు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ అని కేటీఆర్ గుర్తు చేశారు. ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే.. ఈ దేశంలో న్యాయవ్యవస్థ బలంగా, నిజాయితీగా ఉన్నది. ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా, నువ్వు దొరికావు.. రాజీనామా తప్పదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
✳️ బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా ?
బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోము
✳️ ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ లోనే ఆయన బావమరిది శోద కంపెనీకి ₹1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం
✳️ అవినీతి…
— KTR (@KTRBRS) September 29, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | 1908లో నిజాం రాజు ఇండ్లు కూలగొట్టలే.. కానీ రేవంత్ కూలగొడుతున్నడు.. హరీశ్‌రావు ఫైర్
KTR | జ్వరం నుంచి కోలుకున్న కేటీఆర్.. రేపు, ఎల్లుండి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటన