KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జ్వరం నుంచి కోలుకున్నారు. 72 గంటల తర్వాత జ్వరం తగ్గినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజేంద్రనగర్, అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలో ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో పర్యటించనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. బుల్డోజర్ బెదిరింపులను సాధ్యమైనంత వరకు అరికట్టాలి.. దాని కోసం మేం చేయగలిగినంత వరకు చేస్తామని కేటీఆర్ తెలిపారు.
36 గంటలుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నా. వైద్యుల సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీబయాటిక్స్ మందులు వాడుతున్నా. త్వరలో కోలుకుంటా. తెలంగాణ భవన్‌కి వస్తున్న హైడ్రా బాధితులకు పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ న్యాయవిభాగం అండగా ఉంటుంది అని కేటీఆర్ శనివారం ఉదయం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Almost back to normal after 72 hours.
Will be visiting the affected areas in Rajendra Nagar constituency tomorrow and Amberpet Day after
These mindless, ill conceived bulldozer bullying has to be stopped and we will do everything possible for the affected people
— KTR (@KTRBRS) September 29, 2024
ఇవి కూడా చదవండి..
Airport Metro | ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్మెంట్ మార్పు.. ఫోర్త్ సిటీ వరకు మెట్రో
Harish Rao | 1908లో నిజాం రాజు ఇండ్లు కూలగొట్టలే.. కానీ రేవంత్ కూలగొడుతున్నడు.. హరీశ్‌రావు ఫైర్