Earthquake | హిమాలయ దేశం నేపాల్ (Nepal)ను భూకంపం (Earthquake) వణికించింది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
ఈ భూకంపం ధాటికి నేపాల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, భూకంపం తీవ్రత స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా, నేపాల్లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015 ఏప్రిల్లో ఇక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 9వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Also Read..
Hurricane Melissa: హరికేన్ మెలిసాను చీల్చుకుంటూ వెళ్లిన అమెరికా విమానం.. వీడియో
Turkey Earthquake | టర్కీలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
Hurricane Melissa: హరికేన్ మెలిసా.. వణికిపోతున్న జమైకా