న్యూయార్క్: కరీబియన్ దీవుల సమీపంలో హరికేన్ మెలిసా(Hurricane Melissa) ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్నది. ఆ హరికేన్ ధాటికి .. జమైకా ద్వీపం అల్లకల్లోం అవుతున్నది. అయితే ఆ హరికేన్‌ను అధ్యయనం చేసేందుకు అమెరికా వైమానిక దళానికి చెందిన వెదర్ విమానం సోమవారం చక్కర్లు కొట్టింది. హరికేన్ మెలిసా ఐ భాగంలో రౌండ్లు వేస్తూ వీడియోలు తీశారు.
TEAL74 is in the eye of Melissa.
Surrounded by rage and fury there is an awkward serenity in the eye of the storm. https://t.co/szNTrhtKZV
— Bill Nelson (@Thelscwxman) October 27, 2025
యూఎస్ఏఎఫ్ సీ-130 జే హెరిక్యూల్స్ (టీఈఏఎల్74) విమానంలో స్టార్మ్ ఛేజర్స్ ఆ హరికేన్ వీడియోను తీశారు. మహాకారంలో వలయాలు తిరుగుతూ ముందుకు కదులుతున్న మేఘాల మధ్యలోంచి ఆ స్టార్మ్ ఛేజర్స్ తమ విమానాన్ని తీసుకెళ్లారు. పైనుంచి మహాభీకరంగా కనిపిస్తున్న ఆ హరికేన్ మధ్యభాగంలో స్తబ్దుగా ఉన్నట్లు వీడియోలో దర్శనమిచ్చింది. టీల్74 టీమ్ కాక్‌పిట్ ఫూటేజ్‌ను రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతున్నది. దట్టమైన తెల్లటి మేఘాలు వలయాకారంలో ముందుకు కదులుతున్న దృశ్యాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఓ కోట తరహాలో ఉన్న తెల్లటి మేఘాల సమూహాన్ని చీల్చుకుంటూ డబ్ల్యూసీ-130జే విమానం దూసుకెళ్లింది. అయితే హరికేన్ మెలిసా మధ్యలో ఉన్న ఐ భాగం మాత్రం ఇంకా నిర్మలంగానే ఉన్నది. ప్రశాంతంగా కనిపిస్తున్న ఆ హరికేన్ అంతర్భాగం నమ్మశక్యంగా లేదు.
కొన్ని మైళ్ల మేర ఆ మేఘాల వలయం ఉన్నది. ఆకాశంలో నిర్మించిన స్టేడియం పైకప్పు తరహాలో సర్క్యూర్ స్పేస్ కనిపిస్తున్నది. అట్లాంటిక్ సముద్ర బేసిన్లో హరికేన్ మెలిసా ఉద్భవించింది. ప్రస్తుతం దీన్ని కేటగిరీ 5 తుఫాన్‌గా ప్రకటించారు. 2025లో అత్యంత శక్తివంతమైన అట్లాంటిక్ స్టార్మ్‌గా తేల్చారు. గంటకు సుమారు 175 మీటర్ల వేగంతో హరికేన్ మెలిసా వెళ్తోంది. జమైకాలో సుమారు 40 ఇంచుల వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ హెచ్చరించింది.