న్యూఢిల్లీ: టర్కీలోని పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం (Turkey Earthquake) వచ్చింది. దీని తీవ్రత 6.1గా నమోదయింది. రాత్రి 10.48 గంటల సమయంలో 5.99 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి (Sindirgi) పట్టణాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఇస్తాంబుల్, ఇజ్మీర్, బుర్సా, మానిసా వంటి నగరాల్లో భూకంప ప్రభావం కనిపించింది. భూకంపం ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఇండ్లలో వస్తువులు ఊగిపోయాయి. జనం ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఇప్పటివరకు 22 మంది గాయపడినట్లు తెలుస్తున్నది.
పశ్చిమ టర్కీలో గత మూడు నెలల్లో ఇది రెండో అతిపెద్ద భూకంపం. సిందిర్గిలో మూడు భవనాలు దెబ్బతిన్నాయని, రెండంస్తుల దుకాణం కుప్పకూలాయని టర్కీ ఇంటీరియర్ మినిస్టర్ అలీ ఎర్లికాయా చెప్పారు. అయితే అప్పటికే ఆయ భవనాల్లో ఉన్నవారు ఖాళీ చేశారన్నారు. కాగా, 2023లో టర్కీ, సిరియాలో 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ధాటికి 59 వేల మంది మరణించారు. వేలాది ఇండ్లు నేలమట్టమయ్యాయి.
A 6.1-magnitude earthquake struck western Turkey, causing damage to several buildings.
Follow: https://t.co/7Dg3b41PJ5 pic.twitter.com/INerPjklLp
— PressTV Extra (@PresstvExtra) October 27, 2025
Footage shows damage caused by a 6.1 magnitude earthquake in western Turkey on Monday, with Turkish media reporting power outages in affected areas
📹: Social media pic.twitter.com/4WrLHEaASi
— The New Region (@thenewregion) October 27, 2025
6.1-magnitude QUAKE shakes Turkey’s Sindirgi in Balikesir province Tremors felt in Istanbul, Izmir, and Bursa#earthquake #Turkey pic.twitter.com/DgDhVJ2vos
— ℂ𝕙𝕖 𝔾𝕦𝕖𝕧𝕒𝕣𝕒 ★ (@cheguwera) October 28, 2025
🇹🇷In Turkey, a strong earthquake with a magnitude of 6.1. There is destruction, the number of victims is being clarified.
Residents of several regions of the country felt strong tremors. pic.twitter.com/RycWzbmmoV
— MAKS 25 🇺🇦👀 (@Maks_NAFO_FELLA) October 27, 2025