Harish Rao | శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ గ్రామం సర్వే నంబర్ 62,63లో జీవో 111 ప్రకారం ఇక్కడ ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదు. కానీ ఇక్కడ రాఘవా కన్స్ట్రక్షన్స్ ఒక భారీ స్టోన్ క్రషర్‌ను డీజిల్ జనరేటర్లమీద నడుపుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతూ.. ఆ రాఘవా కన్స్ట్రక్షన్స్కు ఎండీఎల్ లైసెన్స్ లేదు. దానికి సీఎఫ్ఈ, సీఎఫ్‌వో లేదు. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ లేదన్నారు.
ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టోర్ క్రషర్స్‌ను తనిఖీ చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్, మైనింగ్ డిపార్ట్మెంట్, మే 21, 2025నాడు రాష్ట్రం మొత్తానికి కూడా ఆదేశాలు ఇచ్చింది. మే 21 2025 మెమో నంబర్ 2344915 ద్వారా డీఎంజీ అన్ని స్టోర్ క్రషన్లను తనిఖీలు చేయాలని ఆదేశించింది. మే 22, 2025న రెవెన్యూ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎస్పీడీసీఎల్, మైనింగ్ శాఖ కలిసి రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్ సంస్థను తనిఖీ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను ప్రవేశపెట్టమని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి ఆధారాలు ప్రవేశపెట్టలేదు, షోకాజ్ నోటీసులకు రిప్లై కూడా ఇవ్వలేదన్నారు.
ఆగస్టు 08,2025నాడు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుందని ప్రభుత్వానికి, తెలంగాణ పొల్యూషన్ బోర్డుకు కూడా యాక్షన్ తీసుకోవాలని తనిఖీ చేసిన కమిటీ లేఖ రాశారు. మార్చి 4,2026నాడు రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్ స్థలాన్ని టెక్నికల్ టీమ్ మరోసారి సందర్శించి, మార్చి 13, 2026 నాడు మరో షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మే 03, 2026 నాడు రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద యాక్షన్ తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, మైనింగ్ శాఖ లేఖ రాసిందని అన్నారు.
ఒక క్రషర్ లైసెన్స్ లేకుండా అక్రమ మైనింగ్ చేస్తే ఏడాది జైలు శిక్ష విధించాలని చట్టాలు చెప్తున్నాయి కానీ ప్రభుత్వం రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు..? రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తుందని మైనింగ్ శాఖ రెండు సార్లు లేఖ రాసిందని.. రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఎవరిదో ప్రజలకు తెలియదా..? అని ప్రశ్నించింది. ఆ స్థలంలో ఇది రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థకు చెందిన స్థలమని, కాంగ్రెస్ జెండాలు ఏర్పాటు చేసిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని హరీష్ రావు అన్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంది
శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ గ్రామం సర్వే నంబర్ 62, 63లో రాఘవ కన్స్ట్రక్షన్స్ భారీ స్టోన్ క్రషర్ డీజిల్ జనరేటర్లపై నడుపుతుంది, దానికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు
22–05–2025 నాడు రెవెన్యూ… https://t.co/Lv41lB0LJe pic.twitter.com/aNZPe3RKVd
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2026
‘పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలి’
Mamata Banerjee | బెంగాల్‌ను టార్గెట్ చేస్తే.. కేంద్రంలో బీజేపీని గద్దె దించుతా : మమతాబెనర్జీ
Suicide | వ్యవసాయ విశ్వవిద్యాలయం అటవి ప్రాంతంలో ఒకరు ఆత్మహత్య