AP Job News | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 (ఎండోమెంట్స్) రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా 104 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏపీ ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో రెగ్యులర్ ప్రాంతిపదికన వీటిని నింపనుంది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉతీర్ణులై ఉండాలి. వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి 42 ఏండ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంది. దేవాదాయ చట్టంలోని నిబంధనల ప్రకారం హిందువులై ఉండాలి.

Apply
ఎంపిక
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT), కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT) ద్వారా ఎంపిక చేస్తారు. సీబీఆర్టీలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. సమయం 150 నిమిషాలు. పేపర్-2లో హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్ నుంచి 150 ప్రశ్నలు, 150 మార్కులకు ఉంటుంది. సమయం 150 నిమిషాలు. దీనిలో 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంది.
కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. సమయం 60 నిమిషాలు. దీనిలో వర్డ్ ప్రాసెస్, స్ప్రెడ్‌షీట్, ప్రజంటేషన్ సాఫ్ట్వేర్, ఫైల్ మేనేజ్మెంట్తో సహా ఆఫీస్ ఆటోమేషన్‌లో ఆచరణాత్మక నైపుణ్యాలను పరీక్షిస్తారు.
జీతం
ఎంపికైనవారికి నెలకు రూ. 25,220 నుంచి రూ. 80,910 వరకు ఇస్తారు.
తేదీలు
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 5 (రాత్రి 11:59 గంటల వరకు) లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు, ఇతర వివరాలకు వెబ్సైట్ https://psc.ap.gov.inలో చూడండి.