మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్ నుండి ప్రాణహాని ఉందని పోలీస్‌స్టేషన్ ఎదుట ఓ కుటుంబం మొత్తం పురుగుల మందు డబ్బాతో బైఠాయించి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..ఇంటి దారి, భూవివాదంలో కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే ఎస్ఐ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు గూగులోత్ రూప్సింగ్, వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎస్ఐ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సై వేధిస్తున్నాడని పోలీస్‌స్టేషన్ ఎదుట పురుగుల మందు డబ్బాతో కుటుంబం ఆందోళన
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఎస్సై రవికుమార్ నుండి ప్రాణహాని ఉందని పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మొత్తం పురుగుల మందు డబ్బాతో బైఠాయింపు
ఇంటి దారి, భూవివాదంలో కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే… pic.twitter.com/bl8KzsiTKm
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2026