Yellamma | టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘ఎల్లమ్మ’ (Yellamma) సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఎల్దండి దర్శకత్వంలో, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రంలో హీరోయిన్గా యువ నటి అనంతిక సనిల్‌కుమార్ (Ananthika Sanilkumar) నటించబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.
‘బలగం’ వంటి ఎమోషనల్ అండ్ సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నాయిక పాత్రకు తగినట్టుగా అనంతిక సనిల్‌కుమార్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. నటనకు ఆస్కారం ఉన్న ఈ పాత్రలో ఆమె తన పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెప్పించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్లను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.