Manne krishank | 2028 వరకు టిమ్స్ ఆస్పత్రి పనులు పూర్తి చేయొద్దని రేవంత్ రెడ్డి చెప్పాడా..? : మన్నె క్రిషాంక్
Manne krishank | మేము కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మేము నిర్మించి లబ్ధిదారులకు అందించినం. కానీ వాటిని ఆపేసి ఉన్నవాళ్లను ఖాళీ చేసి అమ్ముకొని.. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారుల దగ్గరకు వెళ్లి ఇయ్యాలి కానీ ప్రైవేట్ గార్డెన్స్‌లో ఫంక్షన్లలో దొంగగా పోయి పంచుకుంటున్నరు.. అమ్ముకుంటున్నారు అని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు.
Manne krishank | మా కంటోన్మెంట్ వన్ టైమ్ ఎమ్మెల్యేకు ప్రతీ దాంట్లో కమీషన్లు కావాలని .. తిరుమలగిరి చెరువు పని మేము మొదలుపెడితే, అక్కడికి ఈయన వెళ్లగానే పని ఆగిపోయిందన్నారు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ ఆరోపించారు. మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ.. మేము కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మేము నిర్మించి లబ్ధిదారులకు అందించినం. కానీ వాటిని ఆపేసి ఉన్నవాళ్లను ఖాళీ చేసి అమ్ముకొని.. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారుల దగ్గరకు వెళ్లి ఇయ్యాలి కానీ ప్రైవేట్ గార్డెన్స్‌లో ఫంక్షన్లలో దొంగగా పోయి పంచుకుంటున్నరు.. అమ్ముకుంటున్నారు.
6 వేల ఇందిరమ్మ ఇళ్లు ఏమైనా చేస్తావా..? అంటే అక్కడ కూడా కమీషన్ తీసుకొని 157/1 జాగాను కూడా గాలికొదిలేసినవన్నారు మన్నె క్రిషాంక్. బొల్లారం నుంచి గాంధీ ఆస్పత్రికి పోతరు.. అది ఫుల్ ఉంటే ఉస్మానియా ఆస్పత్రికి పోతరు. శామీర్‌పేట్ నుంచి, మేడ్చల్ నుంచి పోతరు.. ఇవేవీ అవసరం లేకుండా కేసీఆర్ హైదరాబాద్ నగర విస్తీర్ణం ఎక్కువుంటుంది కాబట్టి నిరుపేద ప్రజలకు ఉపయోగపడేట్టు ఉచిత వైద్యం కోసం బాహుబలి సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యంలాగా నిర్మించిన అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి ఇంతవరకు ఎందుకు పూర్తి అవ్వడంలేదు..? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్వయంగా టిమ్స్ ఆసుపత్రి పనులు 90% పూర్తయ్యాయని చెప్పాడు. 2028 వరకు పనులు పూర్తి చేయకూడదని నీకు రేవంత్ రెడ్డి చెప్పాడా..? అని మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసిన టిమ్స్ ఆసుపత్రి ఇప్పటి వరకు ఎందుకు పూర్తి అవ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. పోలీసులు కూడా మేము ఇక్కడి అనుమతి లేకుండా రావొద్దని అంటున్నారు. ఇది ప్రజల కోసం కట్టించిన ఆసుపత్రి, ఎవరైనా రావొచ్చు. పోలీసులకు కూడా నేను చెప్తున్నా, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే జాగ్రత్తగా ఉండండని హెచ్చరించారు.
మా కంటోన్మెంట్ వన్ టైమ్ ఎమ్మెల్యేకు ప్రతీ దాంట్లో కమీషన్లు కావలి
తిరుమలగిరి చెరువు పని మేము మొదలుపెడితే, అక్కడికి ఈయన వెళ్లగానే పని ఆగిపోయింది
మేము కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కూడా అవినీతికి పాల్పడుతున్నాడు
బాహుబలి సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యం లాగా నిర్మించిన అల్వాల్… pic.twitter.com/U23b5hVIwb
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2026
Read Also :
US Tariff Bill | అమెరికా రష్యాపై ఆంక్షల బిల్లు.. భారత్, చైనాలపై సుంకాల చిల్లు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

