Missing Meghana Movie | సస్పెన్స్ మరియు ఎమోషనల్ డ్రామాలతో ప్రేక్షకులను కట్టిపడేసేందుకు మరో వైవిధ్యమైన చిత్రం వెండితెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఫస్ట్ కాపీ మూవీస్ మరియు కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించేందుకు వస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 18న సుమారు 150 థియేటర్లలో అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మరియు మూడు పాటలకు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. ముఖ్యంగా డిజిటల్ మీడియాలో ఈ సాంగ్స్ తెగ వైరల్ అవుతుండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. ఆర్.ఆర్. ధృవన్ అందించిన సంగీతం ఎంతో ఫ్రెష్ ఫీలింగ్‌ను ఇస్తోందని, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్. కె. నాయుడు కెమెరా పనితనం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేయగా, మొదటి పాటను లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, రెండో పాటను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, మూడవ పాటను ప్రముఖ రచయిత కోన వెంకట్ మరియు మచ్చ రవి లాంచ్ చేయడం విశేషం.
ఈ సినిమా గురించి దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ, ఇది కేవలం సాధారణ థ్రిల్లర్ కాదని, క్లైమాక్స్ లో వచ్చే హుక్ పాయింట్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతారని తెలిపారు. రెండేళ్ల కష్టంతో, బలమైన కంటెంట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, అందుకే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చి సినిమాను రిలీజ్ చేస్తుందని నిర్మాత నరేష్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్‌గా దివెళా శ్రీనివాస్ రావ్ వ్యవహరిస్తుండగా, కథ & స్క్రీన్‌ప్లే వనరాజ్ అందించారు. సంభాషణలు వెంకట్ బద్దిగం సమకూర్చగా, ఎడిటర్ గా బసవా పనిచేశారు. కొరియోగ్రాఫర్లుగా జేడీ, ఈశ్వర్ పెంటి, ఫైట్ మాస్టర్లుగా రామకృష్ణ, స్టంట్ శంకర్ వ్యవహరించారు. లిరిక్స్ ఆర్.ఆర్. ధృవన్, అలరాజు అందించగా, అడిషనల్ స్క్రీన్ ప్లే శ్రీధర్ పరిగి పర్యవేక్షించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా మద్దినేని హరి కృష్ణ, కిషోర్ తోకల వ్యవహరించగా, పిఆర్వోలుగా సోమిశెట్టి నాగేశ్వర రావ్ (SNR), తిరుమలశెట్టి వెంకటేష్ బాధ్యతలు నిర్వర్తించారు.