బూర్గంపహాడ్, సెప్టెంబర్ 10 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ప్రధాన సెంటర్లో బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ గురువారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వాహనాలను ఆపి వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రత నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మద్యం సేవించిన వారికి జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగభిక్షం, సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.