Raghav Chadha : రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)పై మండిపడ్డారు. ‘సర్'(SIR) వివాదంపై స్పందించిన ఆయన తన మాజీ ప్రేయసిలా ఆ పార్టీ ప్రవర్తిస్తోందని విమర్శించారు. ఢిల్లీ ఓటర్ల జాబితాలో తన పేరును ఎలా చేర్చారు? అని ఆప్ ప్రశ్నించడంపై ఆగ్రహానికి గురైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చత్తీస్గఢ్లో మాట్లాడిన ఎంపీ తాను ఆ పార్టీని వదిలేసినా.. సిగ్గులేకుండా తన వెంటపడుతోందని కౌంటర్ ఇచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీ సర్ విషయంలో పదేపదే తన పేరును ప్రస్తావించడంపై ఎంపీ రాఘవ్ చద్దా భగ్గుమన్నారు. ఆ పార్టీ తన గురించి కలలు కంటోందని, తాను పార్టీ నుంచి వెళ్లిపోయినా సరే ఇంకా తన పేరునే తలుస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ‘నా గురించి ఆప్ కలలు కంటోంది. నేను వారి కలలో దెయ్యంలా కనిపిస్తున్నా. అందుకే పదేపదే రాఘవ్ చద్దా.. రాఘవ్ చద్దా అని పగలు రాత్రి కలువరిస్తోంది. చెప్పాలంటే.. నా మాజీ ప్రేయసిలా ఆ పార్టీ వ్యవహరిస్తోంది. ప్రియుడు తనదారి తాను చూసుకున్నా సరే వదలడం లేదు. ఆప్ నేతలు ఏదో రోజు నా కోసం తమ నరాలు కోసుకుంటారని అనిపిస్తోంది. ఈ విషయం గురించి నేను ఆందోళన చెందుతున్నా ‘ అని ఆప్ పార్టీ నేతలకు చద్ధా చురకలు అంటించాడు.
VIDEO | BJP MP Raghav Chadha says, “As far as I and my vote are concerned, the Aam Aadmi Party has reached a point where I appear in their dreams as a ghost. They keep chanting ‘Raghav Chadha, Raghav Chadha’ day and night. I feel the Aam Aadmi Party is like an ex-girlfriend whose… pic.twitter.com/q5LOUVt7YH
— Press Trust of India (@PTI_News) September 10, 2026
ఢిల్లీ ఓటర్ల జాబితాలో రాఘవ్ చద్దా పేరును చేర్చడంపై ఆప్ మండిపడుతోంది. ఓటర్ల లిస్టులో చద్దా పేరు ఎలా ఉంది? అని ఎన్నికల సంఘాన్ని ఆప్ నేతలు ప్రశ్నించారు. ఎంపీ దరాఖాస్తు చేసిన ఫామ్ 6ను బహిర్గతం చేయాలని, అభ్యంతరాలు తెలిపేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆప్ జాతీయ మీడియా ఇన్ఛార్జ్ అనురాగ్ ధండా ఈసీని కోరారు.
Press Note on Inclusion of Name of Shri Raghav Chadha.@ECISVEEP pic.twitter.com/UEQxrBOv7f
— CEO, Delhi Office (@CeodelhiOffice) September 8, 2026
‘రాజిందర్ నగర్ నియోజకవర్గంలో సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకూ అందిన ఫామ్ 6 దరఖాస్తుల్లో చద్దా పేరు లేదని ఆయన ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ ఇదే ఫామ్ కింద ఎంపీ పేరు నమోదు చేసినట్టైతే.. ఎప్పుడు చేశారు? అనేది తమకు స్పష్టత ఇవ్వాలి’అని అనురాగ్ ధండా డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన రాఘవ్ చద్దా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.