Indian 3 | కమల్‌హాసన్ (Kamal Haasan) కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది భారతీయుడు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది ఇండియన్ 2 (Indian 2). శంకర్ (Shankar) డైరెక్షన్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీ 2024 జులై 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైన ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఢీలా పడిపోయింది. దీంతో ఈ ప్రాంఛైజీలో రాబోతున్న ఇండియన్ 3పై ఇక అటకెక్కినట్టేనని వార్తలు వచ్చాయి.
ఇండియన్ 2తోపాటు ఇండియన్ 3కు సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తిచేసినట్టు ఇప్పటికే శంకర్ టీం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇండియన్ 3 థియేటర్లో విడుదల కాదని.. ఓటీటీలో మాత్రమే రిలీజ్ అవుతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇంతకీ శంకర్-కమల్ హాసన్ ప్రాజెక్టు ఇక లేనట్టేనా..? అని డైలామాలో పడిపోయిన అభిమానులు, మూవీ లవర్స్ కోసం ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
కొన్ని మైనర్ ప్యాచ్ వర్క్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. చెన్నై సర్కిల్ కథనాల ప్రకారం మేకర్స్ త్వరలోనే పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారట. కమల్ హాసన్ సేనాపతిగా మరోసారి సందడి చేయనుండగా.. శంకర్ తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ కాబోతున్నాడు. ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందనే దానిపై అధికారిక అప్డేట్ లేనప్పటికీ మేకర్స్ మాత్రం వీలైనంత త్వరలో ఇండియన్ 3ను పూర్తి చేసి విడుదల చేయాలనిప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇదే నిజమైతే శంకర్ భారతీయుడు మేనియాను మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తాడా..? అనేది చూడాలి.
ఇండియన్ 2లో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రల్లో నటించారు. మరి ఇండియన్ 3లో మరి కొత్త యాక్టర్లెవరైనా జాయిన్ అయ్యారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.
KCR | కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి.. రేవంత్ రెడ్డినే రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ వ్యూహం రివర్స్
Nitin Gadkari | హైవే పనులు ఆలస్యంపై సిగ్గుపడుతున్నా.. ప్రారంభోత్సవానికి నేను రాను: నితిన్ గడ్కరీ