BRICS | రష్యా నుంచి 105 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండియా.. బ్రిక్స్ సదస్సులో ఒప్పందం కుదిరేనా
BRICS : 105 వరకు ప్రాంతీయ, పౌర రవాణా విమానాల్ని రష్యా నుంచి ఇండియా కొనుగోలు చేయనుంది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇండియా-రష్యా మధ్య ఈ అంశంపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
BRICS : రష్యా-ఇండియా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఎప్పటినుంచో బలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఇండియా విమానాలు కొంటూ వస్తోంది. తాజాగా మరిన్ని విమానాల్ని రష్యా నుంచి కొనేందుకు ఇండియా సిద్ధమైంది. 105 వరకు ప్రాంతీయ, పౌర రవాణా విమానాల్ని రష్యా నుంచి ఇండియా కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయి.
శనివారం నుంచి ప్రారంభ కానున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇండియా-రష్యా మధ్య ఈ అంశంపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్-114-300 సంస్థకు చెందిన ప్రాంతీయ, ప్యాసింజర్ విమానాల్నిఇండియాలోని వివిధ సంస్థలు కొనుగోలు చేయనున్నాయి. ఈ అంశంపై సంస్థ సీఈవో వాదిమ్ బదేకా మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ఇండియన్ కంపెనీలతో చర్చలు జరిగాయని, అనేక ఒప్పందాలు జరిగాయని వెల్లడించారు. ఇండియన్ కంపెనీలైన పినాకిల్ ఎయిర్ సంస్థ 50 విమానాల్ని, ఎయిర్ కేరళ సంస్థ 20 విమానాల్ని కొనుగోలు చేయనుండగా.. మరో సంస్థ మిగతా 35 విమానాల్ని కొనుగోలు చేయనుంది.
ఈ మేరకు సంస్థల మధ్య ఎంవోయూ కుదుర్చుకోనున్నాయి. అలాగే, ఆరు విమానాలకు సంబంధించి ఫ్లెమింగో ఏరోస్పేస్ సంస్థ జనవరిలో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు.. ఇండియాలో విమానాల తయారీ అంశాన్ని కూడా రష్యా పరిశీలిస్తున్నట్లు సమాచారం. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థతో యూఏసీ ఈ అంశంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది అమలైతే.. రెండు సంస్థలు కలిసి ఇండియాలోనే సంయుక్తంగా విమానాల్ని తయారు చేస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

