హుజూర్నగర్ : జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం కదం తొక్కారు. మాట ఇచ్చి మరిచిపోయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో మంత్రి ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో వినతి పత్రం ఇచ్చారు. బుధవారం మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, తహసిల్దార్ బండ కవితలకు జర్నలిస్ట్లు వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన స్థలాలను అర్హులకు అందివ్వాలని వారు కోరారు.
ఎన్నికల ప్రచారంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించి, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ద్వారా ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని జర్నలిస్ట్లు తెలిపారు. కానీ, మంత్రి అయ్యాక ఆయన ఈ అంశంపై చర్యలు తీసుకోలేదని వారు వాపోయారు. మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, తాసిల్దార్ బండ కవితలకు వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు తమసమస్యలను పరిష్కరించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులకు పట్టణంలో రామస్వామి గుట్ట వద్ద ఇళ్ల స్థలాలను అందజే సిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా ఈ అంశంపై చర్యలు లేవని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పిల్లలమర్రి శ్రీనివాస్, ఉష శ్రీ, దొంతగాని రాజా రమేష్, రమేష్ రెడ్డి, ఆత్కూరి వెంకటేష్, నాగుల్ మీరా, కీతా రామనాదం, జానీ, సైదా, మహేష్, నక్క నరేష్, నాగేశ్వర రావు, పాల్గొన్నారు.