KTR | ఈ అరాచక పాలనను అంతమొందించాలంటే కొత్తతరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా అవి కేసీఆర్ ఎన్నికలుగానే ఉంటాయి.. అసెంబ్లీ ఎన్నికలు కాదు. కేసీఆర్ ఎన్నికలే ఈ రాష్ట్రంలో జరుగుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చే ఎన్నికలే జరుగుతయని నాకు విశ్వాసముందన్నారు. ఇది నా ఆలోచన కాదు.. రాష్ట్రంలో ఎవరినైనా అన్నా ఎట్లున్నది పరిస్థితి అని అడగండి. రైతన్నల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నేను జగిత్యాలకు పోతే అక్కడ ఓ రైతు సోదరుడు కలిసిండు. అన్న ఎట్లున్నది పరిస్థితి అని అడిగిన. ఆ ఏముంది సార్ మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. రూ.27 వేల కోట్లు మిగిలినయి. అందులో నుంచి 20 వేల కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసినా అని డబ్బా కొట్టుకుంటున్నడు. మా పైసలు మాకే ఇచ్చి మీదికెళ్లి బాకీ ఉన్నడు.. కానీ బయటకు మాత్రం రైతు బంధు ఎగ్గొట్టిన అని చెప్పడు. రుణమాఫీ చేసినా అని చెప్పి.. అది కూడా ఊరిలో చారానా మందికి చేసిండు. బారానా మందికి కాలేదు. అగో గట్లుంది పాలనా అని ఒకే ఒక్కమాటలో రైతన్న చెబుతున్నడు.
ఏ యువకుడినైనా అడగండి రెండు లక్షల ఉద్యోగాలని ఊరించి పెద్ద పెద్ద మాటలు చెప్పి చివరకు మోసం చేసి గద్దెనెక్కి.. ఇంతవరకు రెండున్నర సంవత్సరాల్లో 11 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మహిళలకు స్కూటీలు, తులం బంగారం అన్నడు.. నెలకు రూ.2500 ఇస్తా అన్నడు.. అత్తకు రూ.4 వేలు, కోడలుకు రెండున్నర వేలు నోటికి ఎంతొస్తే అంత మాటలిచ్చి మహిళలను మోసం చేసిండు. కేసీఆర్ రాకముందు 200 పెన్షన్ వచ్చేది. కేసీఆర్ దాన్ని రూ.2 వేలు చేసిండు. నవంబర్లో అయితే రూ.2వేలు, డిసెంబర్లో అయితే 4 వేలు అని చెప్పిండు. ముసలోళ్లను కూడా మోసం చేసిండు. రెండు నెలలు ఇప్పటికీ పెన్షన్ ఎగ్గొట్టిండు. 28 నెలల్లో సాధించింది ఏమైనా ఉందంటే ఒకే ఒక్కటి ఢిల్లీకి పోవుడు. వచ్చుడు.. ఎక్కే విమానం.. పోయే విమానం తప్ప ఈ రాష్ట్రంలో చేసింది మాత్రం ఏమీ లేదన్నాడు.
అరటి పండ్ల బండ్లను కూడా విడిచిపెట్టడట. ..
మీ ఎమ్మెల్యే గురించైతే నేను చెప్పే అవసరమే లేదు. ఆయన ఎట్లాంటోడో ఏమేం వసూళ్లు చేస్తడో నాకంటే బాగా మీకే తెలుసు. ఆఖరికి అరటి పండ్ల బండ్లను కూడా విడిచిపెట్టడట అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గట్లాంటోడి గురించి నేను మాట్లాడ కని.. ఒకటి మాత్రం పక్కా. మంచి రెడ్డి లాంటి మంచి నాయకుడిని కోల్పోవడం వల్ల ఆయనకేం నష్టం కాలేదు. ఆయన బాగానే ఉన్నడు.. కానీ నష్టపోయింది ఇబ్రహీం పట్నం ప్రజలు అని గుర్తు చేస్తున్నా. మంచి నాయకుడు కేసీఆర్ను కోల్పోయినం. ఇబ్రహీంపట్నంలో మంచి రెడ్డి కిషన్ రెడ్డి లాంటి మంచి నాయకుడిని పోగోట్టుకున్నం. అందుకే ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకలు నా కంటే బాగా మీకే తెలుసనన్నారు కేటీఆర్.
కేసీఆర్ నాయకత్వంలో 14 వేల ఎకరాలు సేకరించి గ్రీన్ ఫార్మా సిటీ పెట్టాలే. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్.. అంటే ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో స్థానికంగా కాలుష్యమనేది లేకుండా అక్కడే బాగా చేయాలనే ఉద్దేశంతో దాదాపు 7 సంవత్సరాలు కిషన్ రెడ్డి, సబితక్క, నేను కష్టపడి చాలా మందిని ఒప్పించి మెప్పించి కొంత ఇబ్బంది పెట్టి కూడా రైతులకు మొక్కాలే.. తడ్లాండి 14 వేల ఎకరాలు సేకరించినమని చెప్పుకొచ్చారు.
Live: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం.@KTRBRS
— BRS Party (@BRSparty) April 11, 2026