డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘స్లమ్ డాగ్ : 33 టెంపుల్ రోడ్' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బలమైన భావోద్వేగాలతో కూడిన పవర్ఫుల్ యాక్షన్ మిస్టరీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా త్వరలో విడుదల కానున్నది.
తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘స్లమ్ డాగ్ : 33 టెంపుల్ రోడ్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బలమైన భావోద్వేగాలతో కూడిన పవర్ఫుల్ యాక్షన్ మిస్టరీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా త్వరలో విడుదల కానున్నది. సీనియర్ హీరోయిన్ టబూ ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆమె పాత్రకు సంబంధించిన పవర్ఫుల్ గ్లింప్స్‌ని సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం స్లమ్ ఏరియా వాతావరణాన్ని పరిచయం చేస్తూ ఈ గ్లింప్స్ సాగింది. అక్కడ కారు దిగి, సిగరెట్ వెలిగించి, పరిస్థితులను తన కంట్రోల్లోకి తీసుకునే డిప్యూటీ కమిషనర్, ఇన్‌కమ్‌ట్యాక్స్ గౌరీ హెగ్డేగా టబూ గ్లింప్స్‌లో కనిపించారు.
స్థానిక గూండాకు చెంపదెబ్బతో వార్నింగ్ ఇచ్చే సన్నివేశాన్ని బట్టి ఆమె పాత్ర ఎంత శక్తివంతంగా ఉంటుందో అవగతమైంది. పవర్ఫుల్ పాత్రలను డిజైన్ చేయడంలో సిద్ధహస్తుడైన పూరీ జగన్నాథ్.. టుబూ పోషించిన గౌరీ హెగ్డే పాత్రను తనదైన శైలిలో ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్టు గ్లింప్స్ చెబుతున్నది. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేశ్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సామ్ కె.నాయుడు, సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మికౌర్, జేజీ నారాయణ్‌రావు కొండ్రోళ్ల, నిర్మాణం: పూరీ కనెక్ట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
Ramayana | ‘రామాయణ’ రెండో ట్రైలర్ దసరాకేనా.. అక్టోబర్ 20న మరో భారీ అప్డేట్!
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

