సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ ) : జలమండలి పరిధిలోని హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఫోర్ బే, మిరాలం ఫిల్టర్ బెడ్స్ సెట్టింగ్ ట్యాంకులు, ఇన్లెట్ ఛానళ్లను శుభ్రం చేయనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో(Water supply) అంతరాయం కలగనుంది. ఈ నెల 11 (శనివారం)న ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ఈ క్లీనింగ్ పనులు నిర్వహించనున్నారు.
24 గంటల పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా అంతరాయం ఏర్పడనుందని అధికారులు పేర్కొన్నారు. హసన్‌నగర్, కిషన్‌బాగ్, దూద్‌బౌలి, మిస్రిగంజ్, పత్తర్ గట్టి, దారుల్ షిఫా, మొఘల్‌పురా, జహనుమా, చందులాల్ బరాదరి, ఫలక్‌నుమా, జంగంమెట్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, ఈ ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఏసీబీ విచారణకు కేటీఆర్ వెంట లాయర్ వెళ్లొచ్చు.. కానీ
Harish Rao | కేటీఆర్ మీద పెట్టిన అక్రమ కేసు.. ప్రశ్నించే గొంతుక మీద పెట్టిన కేసు : హరీశ్‌రావు
King Fisher Beers | మందు బాబులకు షాక్.. తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేత