KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌పై మళ్లీ సాయంత్రం 4 గంటలకు విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తికి కేటీఆర్ వెంట వెళ్లే లాయర్ పేరును న్యాయవాది ప్రభాకర్ రావు తెలిపారు. కేటీఆర్ వెంట మాజీ అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు వెళ్తారని న్యాయమూర్తికి తెలిపారు.
కేటీఆర్‌కు కనిపించే దూరంలో న్యాయవాది ఉంటారని జడ్జి చెప్పారు. కేటీఆర్‌ను ఒక గదిలో, లాయర్‌ను ఒక గదిలో కూర్చోబెట్టి.. విచారణ కనిపించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు ఏఏజీకి సూచించింది. లైబ్రరీ విండో నుంచి కేటీఆర్ విచారణను చూడొచ్చని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఇక కేటీఆర్ విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇందుకు హైకోర్టు నిరాకరించింది. సీసీటీవీ పర్యవేక్షణలో కేటీఆర్‌ను విచారించాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాది రామచంద్రరావుతో కలిసి రేపు ఏసీబీ విచారణకు వెళ్లాలని కేటీఆర్‌కు హైకోర్టు సూచించింది. రేపటి విచారణ తర్వాత అనుమానాలుంటే మళ్లీ సంప్రదించాలని కోర్టు సూచించింది.
కాగా, ఫార్ములా ఈ-కార్ రేస్‌పై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టాలని కోరితే ముఖ్యమంత్రి ఎందుకు పారిపోయారని, రేవంత్‌రెడ్డికి దమ్ముంటే.. ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో మీడియా సమక్షంలో చర్చ పెడితే తాను రెడీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏసీబీ విచారణకైనా, ఈడీ విచారణకైనా సిద్ధమేని స్పష్టంచేశారు. రాజ్యాంగం, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉన్నదని, తనపై మోపిన అక్రమ కేసులపై న్యాయస్థానాల్లోనే కొట్లాడుతామని తేల్చిచెప్పారు. ఈ కేసులు ఆరంభం మాత్రమేనని, నాలుగేండ్లలో ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని, దేశానికి రక్షణ కవచంలా న్యాయ వ్యవస్థ ఉన్నదని పేర్కొన్నారు. ‘నిజాయితీకి ధైర్యం ఎకువ.. రోషంగల్ల తెలంగాణ బిడ్డగా ఏ విచారణనైనా ఎదురొనేందుకు సిద్ధం’ అని నిన్న రాత్రి మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేటీఆర్ చెప్పారు. లాయర్లతో విచారణకు బుధవారం హైకోర్టు అనుమతిస్తే 9న ఏసీబీ విచారణకు లాయర్లతో వెళ్తానని తెలిపారు. 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని, వారు ఏమడిగినా సమాధానం చెప్తానని, దాపరికం లేదు.. దాయాల్సిందేమీ లేదని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | కేటీఆర్ మీద పెట్టిన అక్రమ కేసు.. ప్రశ్నించే గొంతుక మీద పెట్టిన కేసు : హరీశ్‌రావు
King Fisher Beers | మందు బాబులకు షాక్.. తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేత
KTR | పర్రె మేడిగడ్డకు కాదు.. నీ పుర్రెకు పడ్డది.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
KTR | అదో లొట్టపీస్ కేసు.. వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు