సూర్యాపేట మార్చి 12 : సూర్యాపేట డివిజన్లోని 8 మండలాల్లో ఖాళీగా ఉన్న 15 రేషన్ షాప్ డీలర్ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు తెలిపారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూర్.ఎస్ మండలంలో (2) గట్టకల్, శెట్టిగూడెం, చివ్వేంల మండలంలో (2) చందుపట్ల 2, వాల్య తండా, జాజిరెడ్డిగూడెం మండలంలో (1) కొమ్మాల, మోతె మండలంలో (2) నరసింహపురం, తుమ్మగూడెం, నాగారం మండలంలో (1) వర్ధమానుకోట, నూతనకల్ మండలంలో (1) ఎడవెల్లి, సూర్యాపేట మండలంలో (3) సూర్యాపేట పట్టణం, ఇమాంపేట 2, తాళఖమ్మంపాడు, తిరుమలగిరి మండలంలో (2) మాలిపురం, రావులపల్లి గ్రామాల్లో డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో స్థానికులు, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండి, 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు తమ కుల ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ నెల 16 నుండి ఏప్రిల్ 14 వరకు సమీప తాసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు సమీప తాసీల్దార్ కార్యాలయాల్లో సంప్రదించాలని పేర్కొన్నారు.