Harish Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద పెట్టిన కేసు అక్రమ కేసు.. ప్రశ్నించే గొంతుపై, ఒక ఉద్యమకారుడిపై పెట్టిన కేసు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. కేటీఆర్‌కు ఆపద వస్తే పార్టీ మొత్తం అండగా నిలబడుతది అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రాఫ్ దిగజారిపోతున్నది.. కాబట్టి ఇలాంటి కేసులు పెట్టి ప్రజలను డైవర్షన్ చేస్తున్నడు. కుట్రలో భాగంగానే కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టిండు. ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఆపదొస్తే బీఆర్ఎస్ ఎట్లా నిలబడ్డదో, పార్టీ మొత్తం కేటీఆర్ వెంట ఉంటది. లగచర్ల గిరిజన రైతుల కోసం కేటీఆర్ ఎంతో కష్టపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటుగా అండగా నిలబడి, న్యాయం చేశాడు అని హరీశ్‌రావు తెలిపారు.
ఈ ఏడాది కాలంలో ఏం చేసినవు నాయనా నువ్వు, పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ తప్ప అని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు. కేటీఆర్ మీద అక్రమ కేసు పెట్టి, అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేసి, పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నవ్. లగచర్ల రైతులను అరెస్టు చేసి, 15 రోజులు డైవర్షన్ చేసినవు. అల్లు అర్జున్ పేరు మీద డైవర్షన్ టాక్టిక్స్ చేసినవు. దానికంటే ముందు తెలంగాణ తల్లి విగ్రహం మార్చి అదో 15 రోజులు డైవర్షన్. టీఎస్‌ను టీజీగా మారుస్తున్నా అని ఒక డైవర్షన్ టాక్టిక్స్. తెలంగాణ ఎంబ్లమ్ మారుస్తున్నా అని చెప్పి డైవర్షన్ టాక్టిక్స్. ఇవి తప్ప నువ్వు ప్రజలకు చేసిందేమైనా ఉన్నదా? నువ్విచ్చిన హామీలు అమలు చేసిందేమన్నా ఉన్నదా? కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాల పరిస్థితి ఏమైంది? అని హరీశ్‌రావు నిలదీశారు.
కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినయి, న్యూట్రిషన్ కిట్లు బంద్ అయిపోయినయి. బతుకమ్మ చీరెలు బంద్ అయిపోయినయి, రైతుబంధు బందయిపోయింది, బీసీ బంధు బందయిపోయింది, దళిత బంధు బందయిపోయింది. ఉన్న పథకాలు బందు పెట్టుడు తప్ప నువ్వు కొత్తగా తెచ్చిందేమన్నా ఉన్నదా? రైతు భరోసా అన్నవు, అపుడేమో ఎకరానికి 15 వేలు ఇస్త అన్నవు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఒక్క పంటకు ఎకరాకు 5 వేలే ఇచ్చినవు. వానాకాలం ఎగ్గొట్టినవు. మళ్లీ ఇపుడు స్థానిక సంస్థల ఎన్నికలున్నయి గనుక మల్లొక్కసారి రైతుబంధు వేస్తాడు, తర్వాత ఎగ్గొడుతడు ఈ ఎగవేతల రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు.
సంక్షేమ పథకాలేమైనయి అంటే డబ్బుల్లేవంటడు. కానీ, ఈయన కుటుంబ సభ్యుల భూముల దగ్గరకి వేల కోట్లు ఖర్చుపెట్టి కల్వకుర్తి దాకా ఆరు లేన్ల రోడ్లు వేసుకుంటున్నడు. రూ. 50 వేల కోట్లతోని మెట్రో రైలు మార్గాలు చేస్తానంటున్నడు. ఎలివేటెడ్ కారిడార్లు కడతా అంటున్నడు. ఆసరా పెన్షన్లకు, రైతు బంధుకు పైసల్లేవంటడు. మూసీకి లక్ష కోట్లు ఎక్కడినుంచి వస్తున్నయి. బడా కాంట్రాక్టర్లకు పైసలివ్వడానికి, ఢిల్లీకి కమీషన్లు పంపడానికి మాత్రం నీకు పైసలొస్తయి. రైతులకు, మహిళలకు ఇవ్వడానికి నీకు డబ్బుల్లేవా అని అడుగుతున్నాం అని హరీశ్‌రావు నిలదీశారు.
ఇవి కూడా చదవండి..
King Fisher Beers | మందు బాబులకు షాక్.. తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేత
Harish Rao | రేవంత్ ఏడాది పాలనలో కోతలు, ఎగవేతలు, కేసులే.. మండిపడ్డ హరీశ్‌రావు
KTR | పర్రె మేడిగడ్డకు కాదు.. నీ పుర్రెకు పడ్డది.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
KTR | ఒక్కొక్కరం కేసీఆర్ లాగా కొట్లాడుదాం.. గ్రామగ్రామాన కథానాయకులను సృష్టిద్దాం : కేటీఆర్