KTR | హైదరాబాద్ : ఈ ఏడాది పోరాట నామ సంవత్సరంగా ముందుకు పోదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఒక్కొక్కరం కేసీఆర్ లాగా కొట్లాడుదాం.. గ్రామగ్రామాన కథానాయకులను సృష్టిద్దాం అని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
కేసీఆర్ స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. కొత్త కమిటీలు వేసుకోవాలి. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలి. బూత్ కమిటీ నుంచి గ్రామ, వార్డు, మండల, పట్టణ, జిల్లా, నియోజకవర్గ, అదే విధంగా రాష్ట్ర కమిటీలు వేసుకోవాలి. దాంతో పాటు కొత్త అధ్యక్షుడిని కూడా ఈ ఏడాది ఎంపిక చేసుకోవాల్సి ఉంది. కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు పెట్టుకుందాం. 32 జిల్లాల్లో పార్టీ ఆఫీసులను యాక్టివేట్ చేసుకుందాం. జిల్లాల్లోనే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకుందాం. 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ మనది. కుటుంబం లాగా ఈ పార్టీకి ఒకరికొకరు అండగా ఉంటూ కాపాడుకుందాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుదాం. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ కాబట్టి తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పని చేసే పార్టీ మనది. తెలంగాణలో ఇబ్బంది అనిపిస్తుందట.. ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండేనట అని ముఖ్యమంత్రికి అనిపిస్తుందట.. ఇది మన ఖర్మ. అందుకే తప్పకుండా వందకు వంద శాతం ఒక్కొక్కరం కేసీఆర్ లాగా కొట్లాడుదాం.. గ్రామగ్రామాన కథనాయకులను సృష్టిద్దాం. అద్భుతంగా ఈ ఏడాది పోరాట నామ సంవత్సరంగా ముందుకు పోదాం అని కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
KTR | పర్రె మేడిగడ్డకు కాదు.. నీ పుర్రెకు పడ్డది.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
KTR | ఏసీబీ విచారణ.. కేటీఆర్‌తోపాటు లాయర్‌ను తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి
KTR | రాష్ట్రంలో త్రీడీ పాలన నడుస్తోంది.. రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్
KTR | అదో లొట్టపీస్ కేసు.. వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు