KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్రీడీ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. త్రీడీ అంటే డిసెప్షన్(మోసం), డిస్ట్రక్షన్(విధ్వంసం), డిస్ట్రాక్షన్(దృష్టి మళ్లించడం) అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
హేమంత్ సోరెన్ జార్ఖండ్లో గెలిచిన తర్వాత నిజాయితీగా.. ఆ రాష్ట్ర ప్రజల మీద ప్రేమతో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు నెలకు రూ. 2500 ఇస్తున్నారు. అదే రేవంత్ ప్రభుత్వం.. మోసం చేస్తోంది. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదు. తెలంగాణలో 90 లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రూ. 2500 చొప్పున ఇస్తున్నట్లు ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి మోసపు మాటలు చెబుతున్నారు అని కేటీఆర్ తెలిపారు.
రెండోది విధ్వంసం.. హైడ్రా బాధితుల ఇబ్బంది ముందు మనది ఏం ఇబ్బంది. లగచర్ల రైతుల ఇబ్బంది ముందు మనది ఏం ఇబ్బంది. 40 రోజుల పాటు గిరిజన రైతులను జైల్లో పెట్టారు. 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ తరుణంలో మనకు ఇబ్బంది ఏం కాదు. కేసులు అనేవి ఇష్యూనే కాదు. జనవరి 8 ఇవాళ. ఇంకా 350 రోజులు మన ముందు ఉన్నవి. రైతుభరోసా విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని గడపగడపకు వెళ్లి చెప్పాలి. రూ. 17500 బాకీ గురించి చెప్పాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పైసా కూడా రైతుబంధు కింద ఇవ్వలేదు. మనం రైతుబంధు ఇద్దామంటే.. ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాసి ఆపారు రేవంత్ రెడ్డి. మనం ట్రెజరీలో పెట్టిన పైసలను నాలుగు నెలలు సతాయించి నాట్లు అప్పుడు ఇవ్వకుండా ఓట్లప్పుడు వేశారు. రుణమాఫీ విషయంలో కనిపించిన ప్రతి దేవుడి మీద ఒట్టు పెట్టిండు.. కానీ కాలేదు. కొండారెడ్డిపల్లి, కొడంగల్ పోదాం.. 100 శాతం రుణమాఫీ అయిందని చెపితే రాజకీయ సన్యాసం తీసుకుంటాం అని చెప్పితే ఉలుకు పలుకు లేదు. కౌలు రైతులు అని పదేపదే కలవరించిండు.. 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాస్తున్నా.. వారిని ఆదుకుంటా అన్నావ్.. వీటన్నింటిని మీరు నిలదీయాలి అని బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | అదో లొట్టపీస్ కేసు.. వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు