KTR | అదో లొట్టపీస్ కేసు.. వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ కేసుకు సంబంధించి.. అదో లొట్టపీస్ కేసు.. వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
KTR | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ కేసుకు సంబంధించి.. అదో లొట్టపీస్ కేసు.. వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ఇవాళ వక్తలు మాట్లాడుతూ.. ఒక మాట అన్నారు.. ఇబ్బందేదో ఉందన్నారు. మనకు నిజంగా ఇబ్బంది ఏమీ ఉంది. కేసీఆర్ పార్టీ పెట్టిన రోజున ఉండే ఇబ్బందులతో పోల్చితే.. ఇది ఇబ్బందే కాదు.. అదో లొట్టపీస్ కేసు.. వాడొక లోట్టపీస్ ముఖ్యమంత్రి.. చేయగలిగేదేమీ లేదు.. ఇబ్బంది లేదు. కేసీఆర్ ఆనాడు కడుపు మాడ్చుకొని తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సపచ్చుడో.. తెలంగాణ జైత్రయాత్రనో.. కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్న ఇబ్బంది ముందు ఇది ఏం ఇబ్బంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూలో బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురి విద్యార్థి నేతల వీపులు విమానం మోత మోగినాయి. యాదయ్య, శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని భగభగమండుతుంటే ఆ ఇబ్బంది ముందు ఇది ఏం ఇబ్బంది.. ఇది లొట్టపీస్ కేసు.. వాడు పీకేది ఏం లేదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మజిల్ పవర్, మీడియా పవర్ లేదు.. అగమ్యగోచర పరిస్థితుల్లో తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసి చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా , కేసీఆర్ రక్తం పంచుకుపుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానేకాదు. ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Nagarkurnool | తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కి మహిళల నిరసన : వీడియో
Harish Rao | ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ తన అసలు రంగు బయటపెట్టింది.. హరీశ్‌రావు ఆగ్రహం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

