నాగర్కర్నూల్ : కాంగ్రెస్ పాలనలో తాగునీటి కోసం ప్రజలు తంట్లాడుతున్నారు. ప్రజా సంక్షేమాన్ని మరిచి పార్టీ ఫిరాయింపులు, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడంలో ప్రభుత్వం బిజీగా దీంతో పాలనా పడకేయడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. గుక్కెడు నీళ్ల కోసం మైళ్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి నెకొంది. తాజాగా మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీరు రాకపోవడంతో నాగర్కర్నూల్(Nagarkurnool )జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలోని ఏడో వార్డులో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీళ్ల సమస్య తీర్చాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
మిషన్ భగీరథ నీళ్లు రాక.. తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్లెక్కి నిరసన
నాగర్ కర్నూల్ – కొల్లాపూర్ మండలం రామాపురం ఏడో వార్డులో నెల రోజులుగా నీటి ఎద్దడి
మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్న కాలనీ వాసులు
ఇప్పటికైనా నీళ్ల సమస్య తీర్చాలని ప్రభుత్వాన్ని… pic.twitter.com/QhDfIMGoCX
— Telugu Scribe (@TeluguScribe) January 8, 2025