KTR | మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని హాస్టల్లో విద్యార్థినులకు బ్రేక్‌ఫాస్ట్‌కు బదులు గొడ్డుకారం అన్నం పెట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ స్కూల్ పిల్లలకు పౌష్టికాహారం కింద ఉప్పు, కారం, బియ్యం.. ఈ అమానవీయ పరిస్థితిపై స్పందించగల జాతీయ లేదా ప్రాంతీయ మీడియాకు ఈ శీర్షికను సూచిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
హాస్టల్ విద్యార్థినులకు గొడ్డు కారంతో భోజనం పెట్టడంపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రియాంక గాంధీ 2019లో ఆమె చేసిన ప్రకటనను గుర్తు చేసుకుని తెలంగాణ విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని సూచించారు. లేదా యూపీలో జరిగినప్పుడే దీన్ని జాతీయ సమస్యగా పరిగణిస్తారా? వేరే రాష్ట్రంలో జరిగిన అలాగే చూస్తారా అని నిలదీశారు. ఇది తెలంగాణ కాబట్టి ఉప్పు మాత్రమే కాకుండా.. ఉప్పుతో పాటు కారం కూడా ఉండటంతో వార్తకు స్పైసీనెస్ తగ్గిందా? లేదా సమస్య తీవ్రత తగ్గిందని భావిస్తున్నారా అని ప్రశ్నించారు.
“Telangana School Children Get Salt, Chilly Powder & Rice Under Scheme Meant to up Nutritional Intake”
Suggesting this headline to any national, vernacular media that cares about the inhumanity of the situation!
Also may be Priyanka Gandhi ji can rehash her statement from… pic.twitter.com/SRfugePCX7
— KTR (@KTRBRS) January 8, 2025
అసలేం జరిగిందంటే..
నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినులకు గొడ్డుకారం అన్నం బ్రేక్‌ఫాస్ట్‌గా అందించారు. వర్సిటీలోని కృష్ణవేణి బాలికల వసతి గృహంలో మంగళవారం విద్యార్థినులకు బ్రేక్ ఫాస్ట్‌గా అన్నంతోపాటు గొడ్డుకారం పెట్టారు. విద్యార్థులు ప్లేట్లతో క్యూలో ఉండగా అన్నం, కారం బేసిన్, ఉప్పు డబ్బా పక్కనే ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎంజీయూలో కారం అన్నమే బ్రేస్ట్‌ఫాస్ట్ అంటూ చక్కర్లు కొట్టాయి.