Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో సీఎంగా రేవంత్ రెడ్డి పాలన ఏడాది అయిపోయింది. ఏడాదిలో ఏమన్నా చేసిండా అంటే.. అయితే కోతలు, లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణలో భవన్లో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
గతంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమ సభలుగా విలసిల్లినయి, ఉద్యమానికి గొప్ప ఊతమిచ్చాయి. ఈ డైరీ తిరగేస్తుంటే 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం, మన పార్టీ సాధించిన విజయాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. ప్రతి పార్టీ నాయకుడు, కార్యకర్తలు ఈ డైరీని తమ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి డైరీ ఆవిష్కరణ సభలు రాష్ట్ర సాధనకు ఉపయోగపడితే, నేటి డైరీ ఆవిష్కరణ సభ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని తెలపడానికి, తిరిగి అధికారంలోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడాలని హరీశ్‌రావు సూచించారు.
కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే.. వాటికి కోతలు పెట్టారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన వాటిని కూడా ఎగవేస్తున్నారు. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెడుతున్నారు. ఇంతకుమించి రేవంత్ రెడ్డి సాధించినదైతే ఏమీ లేదు. మానకొండూరు సభలో నేను మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డీ నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు, రైతుబంధు ఎగ్గొట్టినవు, తులం బంగారం ఎగ్గొట్టినవు, మహిళలకు మహాలక్ష్మి ఎగ్గొట్టినవు, వృద్ధులకు 4 వేల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టినవు. నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఇప్పటినుంచి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్నాను. ఎగ్గొట్టినోన్ని ఎగ్గొట్టిండు అంటే కూడా తప్పేనా?ఇదన్నందుకు మానకొండురు పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టిండు. ఇపుడు పోలీస్ స్టేషన్‌కు రమ్మని నాకు నోటీసుల మీద నోటీసులు వస్తున్నయి. నువ్వు ఎగ్గొట్టింది నిజం కాదా, నువ్వు కోతలు పెట్టింది నిజం కాదా? అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఒక్కొక్కరం కేసీఆర్ లాగా కొట్లాడుదాం.. గ్రామగ్రామాన కథానాయకులను సృష్టిద్దాం : కేటీఆర్
KTR | పర్రె మేడిగడ్డకు కాదు.. నీ పుర్రెకు పడ్డది.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
KTR | ఏసీబీ విచారణ.. కేటీఆర్‌తోపాటు లాయర్‌ను తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి
KTR | రాష్ట్రంలో త్రీడీ పాలన నడుస్తోంది.. రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్