హైదరాబాద్ : విద్యుత్ స్తంభాన్ని ఢీకొని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై(PV Expressway) కారు బోల్తా(Car accident) పడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలించారు. కారు రోడ్డుకు అడ్డంగా బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.