హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో(Road accident) ఓ విద్యార్థి మృతి(Student dies) చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కాజా వాణి సింగారం గ్రామానికి చెందిన మోతీరాం కుమారుడు తేజ చౌదరి (14) నారపల్లి దివ్య నగర్ లోని నల్ల మల్లారెడ్డి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం తన స్కూటీపై పర్వతాపూర్ స్పాంజిల్లా గ్రేడ్ కమ్యూనిటీ కాలనీలో ట్యూషన్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు.
ఇదే క్రమంలో ముందు వెళ్తున్న టిప్పర్ వాహనం యూటర్న్ తీసుకుంటుండగా పక్క నుంచి వస్తున్న తేజ టిప్పర్ని ఢీ కొట్టాడు ఈ ప్రమాదంలో ముందు టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తేజ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇవి కూడా చదవండి..