Talasani Srinivas Yadav | హైదరాబాద్ : ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం నెక్లెస్ రోడ్లోని బుద్ధ భవన్ వద్ద గల కర్బలా మైదానంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించే బతుకమ్మ పండుగ ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వేలాది మంది మహిళలు పాల్గొననున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బతుకమ్మ పూర్తయ్యే వరకు వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ట్రాఫిక్ మళ్ళించేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.
బతుకమ్మ ఆడే ప్రాంతం మొత్తం లైట్లను ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా బతుకమ్మలను నిమజ్జనం చేసే హుస్సేన్ సాగర్లోని బతుకమ్మ ఘాట్లో కూడా లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. బతుకమ్మ పాటలతో కూడిన సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. వచ్చిన ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఆడే ప్రాంతం, బతుకమ్మ ఘాట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ అని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి 9 రోజులపాటు మహిళలు ఎంతో ఘనంగా జరుపుకుంటారని వివరించారు. ప్రతి సంవత్సరం కర్బలా మైదానంలో నిర్వహించే బతుకమ్మకు వచ్చే మహిళలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లను చేస్తూ వస్తున్నామని, ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక్క తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన బతుకమ్మ పండుగ దేశ విదేశాలలో నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణమని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
Nagarjuna Akkineni | నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు.. రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు
KTR | మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు..? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్
Rain Alert | తెలంగాణ, ఏపీల్లో నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్