KTR | హైదరాబాద్ : మూసీ నది ప్రక్షాళన పేరుతో.. పేదల జీవితాలతో ఆటాడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా.. రైతు రుణమాఫీ, రైతుబంధు ఎగ్గొట్టిన రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ సర్కార్ పరిపాలనపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు..? అని కేటీఆర్ నిలదీశారు. రైతుబంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు..? మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రూ. 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు..? అవ్వ, తాతలకు నెలకు రూ. 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు..? ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు..? మూసీ బ్యూటిఫికేషన్ పేరిట రూ. 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్‌కి తెరతీసిన ఘనుడు ఎవరు..? అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
మూసి వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు?
✳️ రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసి లో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు?
✳️ రైతు బంధు ఎగ్గొట్టి, మూసి పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?
✳️ మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు…
— KTR (@KTRBRS) October 5, 2024
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం..: కేటీఆర్
Rain Alert | తెలంగాణ, ఏపీల్లో నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్
Operation Musi | మా కన్నీళ్లు తుడిచేదెవరు?.. మూసీవాసుల రోదన