హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రజా పాలన ప్రజల చావుకొచ్చినట్లయింది. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ దవాఖానలు నేడు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. తాజాగా నగరంలోని నీలోఫర్ హాస్పిటల్లో(Niloufer hospital) నీళ్లులేక సర్జరీలు(Surgeries )ఆగిపోయిన దుస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..రెండు రోజుల క్రితం దవాఖానలోని సంపు వద్ద ఉన్న బోర్ పాడవడంతో అత్యవసర విభాగంలోని ఐదంతస్తులకు నీటి కొరత ఏర్పడింది.
ఈ భవనంలో పిడియాట్రిక్, పిడియాట్రిక్ సర్జరీ, గైనిక్ విభాగానికి సంబంధించి ప్రసవాల గదితోపాటు నిత్యం 25 నుంచి 30 సర్జరీలు జరిగే ఆపరేషన్ థియేటర్ ఉన్నాయి. రెండు రోజులుగా నీరందక నరకం చూసినట్లు రోగులు, రోగి సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.