Srinivas Yadav | విద్యార్థులు గురుకులాల్లో చస్తుంటే బర్త్ డే వేడుకలా? : గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఫైర్
Srinivas Yadav | రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకలు అన్ని గురుకుల పాఠశాలల్లో(Gurukula schools) అధికారికంగా నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్(Gellu Srinivas Yadav) తెలిపారు.
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకలు అన్ని గురుకుల పాఠశాలల్లో(Gurukula schools) అధికారికంగా నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్(Gellu Srinivas Yadav) తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఉపాధ్యక్షుడు తుంగబాలు, రఘురాంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేసిన పొన్నం ప్రభాకర్‌కు నిబంధనలు తెలియవా? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకలు గురుకుల పాఠశాలల్లో ఎందుకు చేయాలన్నారు. రాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు దవాఖాన పాలు అవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా కూడా గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రివ్యూ చేయలేదని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను చంపడమే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమా? అని నిలదీశారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే గురుకుల పాఠశాలలకు పర్మినెంట్ బిల్డింగ్స్ కట్టాలన్నారు. గురుకుల పాఠశాలలకు ప్రభుత్వం నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో సమస్యలు అడిగి తెలుసుకుంటామని, సమస్యల దరఖాస్తులను కేటీఆర్, ప్రభుత్వానికి ఇస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వ్యవస్థలను కుప్పకూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
50% మందికి వర్క్ ఫ్రమ్ హోమ్
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

