అడిలైడ్: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో.. ఆస్ట్రేలియా జట్టు 163 పరుగులకే ఆలౌటైంది. అడిలైడ్ మైదానంలో పాకిస్థాన్ స్పీడ్ బౌలర్ హరిశ్ రౌఫ్(Haris Rauf) దడదడలాడించాడు. 8 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి కీలకమైన 5 వికెట్లను తీసుకున్నాడు. ఫస్ట్ వన్డేలో 3 వికెట్లు తీసుకున్న రావల్పిండి బౌలర్.. రెండో వన్డేలోనూ రఫాడించాడు. తన పేస్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లను దెబ్బతీశాడు. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ రిజ్వాన్ ముందుగా ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే ఓపెనర్ బౌలర్ షహీన్ షా అఫ్రిది .. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. తొలుత ఇద్దరు ఓపెనర్లను అఫ్రిది తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత రౌఫ్ తన పేస్ అటాక్‌తో అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఆసీస్ జట్టులో స్టీవ్ స్మిత్ అత్యధికంగా 35 రన్స్ చేశాడు. తొలి వన్డేలో చాలా స్వల్ప తేడాతో పాకిస్థాన్ ఓడిన విషయం తెలిసిందే.
.@HarisRauf14‘s stunning spell bundles out Australia for 1️⃣6️⃣3️⃣ 🎯
Pakistan’s chase begins soon 🏏#AUSvPAK pic.twitter.com/5VtMijtvzD
— Pakistan Cricket (@TheRealPCB) November 8, 2024
రిజ్వాన్ వరల్డ్ రికార్డు
పాకిస్థాన్ కీపర్ రిజ్వాన్ వరల్డ్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 6 క్యాచ్‌లను పట్టాడు. అయితే 7వ క్యాచ్‌ను అతను చేజార్చాడు. నసీమ్ షా బౌలింగ్‌లో ఆడం జంపా ఇచ్చిన క్యాచ్‌ను అతను 34వ ఓవర్లో వదిలేశాడు. గతంలో ఈ రికార్డును 8 మంది కీపర్లు అందుకున్నారు. పాక్‌కు చెందిన సర్ఫరాజ్ అహ్మద్ కూడా గతంలో ఓసారి ఆరు క్యాచ్‌లు పట్టాడు. ఇక ఆసీస్ దిగ్గజ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ వన్డేల్లో అత్యధికంగా నాలుగు సార్లు ఆరేసి క్యాచ్‌లు అందుకున్న కీపర్‌గా రికార్డు సృష్టించాడు.
స్వల్ప టార్గెట్‌తో రెండవ వన్డేలో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు.. లక్ష్యం దిశగా వెళ్తున్నది. 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 62 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై 2017లో చివరిసారి పాకిస్థాన్ వన్డే మ్యాచ్ నెగ్గింది. ఆ టైంలో హఫీజ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.