హైదరాబాద్ : బైక్ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు పదోతరగతి విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నాలుగు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నిందులు 15 ఏండ్ల లోపు ఉన్న మైనర్లు కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే..కూకట్పల్లి, దయార్గూడ, సంగీత్నగర్, సప్తగిరి కాలనీల్లో ఇటీవల నాలుగు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కూకట్పల్లి బస్టాప్ వద్ద తనిఖీలు చేపడుతుండా ఓ బాలుడు పట్టుబడ్డాడు. అతడిచ్చిన సమాచారంతో మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని జువైనల్ హోంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
OTT Moives | ఈ వారం థియేటర్లలో చిన్న చిత్రాల సందడి… ఓటీటీల్లోకి క్రేజీ సినిమాలు
Miheeka Bajaj | వంటగదికి దూరంగా రానా సతీమణి… అత్తమ్మ వంటపై ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!