బంజారాహిల్స్,నవంబర్ 25 : బంజారాహిల్స్(Banjara Hills) రోడ్ నెం 14లో ట్రాఫిక్ పోలీసులు అపరేషన్ రోప్(Operation Rope) కార్య క్రమాన్ని చేపట్టారు. నందినగర్ నుంచి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు వెళ్లేదారిలో వెలిసిన రోడ్డు అక్రమణలను ట్రాఫిక్ పోలీసులు సోమవారం తొలగించారు. టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, పండ్ల వ్యాపారాలు రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండడంతో పాటు వాహనాలు పార్క్ చేస్తుండడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు ఇటీవల వారికి హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ పద్దతి మార్చుకోకపోవడంతో వాటిని తొలగించారు. మరోసారి రోడ్డు ఆక్రమణలకు పాల్పడితే కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ హెచ్చరించారు.
Devi Sri Prasad | ఎవరూ క్రెడిట్ ఇవ్వరు.. హాట్ టాపిక్‌గా పుష్ప నిర్మాతలపై డీఎస్పీ కామెంట్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా
Jr NTR | హిందీలో రెండో సినిమా.. ఆ అగ్రిమెంట్‌పై తారక్ సైన్ చేశాడా ఏంటీ..?
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్