ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Hyderabad - Jun 21, 2020 , 00:27:47

రైతుబజార్లకు కొ్త్త హంగులు...

రైతుబజార్లకు కొ్త్త హంగులు...

 ఎల్బీనగర్‌ : జాతీయ రహదారికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లను కొత్త హంగులతో తీర్చిదిద్దారు. మెట్రో స్టేషన్‌ ప్రాంతాలు, ప్రధాన మార్కెట్‌ ప్రాంతాల్లో పాదచారుల అవసరాలు తీర్చే విధంగా ఫుట్‌పాత్‌లను ఆధునీకరించారు. అంతేగాకుండా అక్కడక్కడా కూర్చునే ఏర్పాట్లు సైతం చేశారు. విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో పుట్‌పాత్‌లపై పలు నమూనాల్లో బెంచీలను ఏర్పాటు చేసి రంగులద్దడంతో మెరిసిపోతున్నాయి. 

  గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ వద్ద.. 

 గతంలోనే గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ వద్ద ఇరువైపులా పండ్ల నమూనాల్లో ప్రయాణికులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేశారు. తాజాగా జాతీయ రహదారిపై కొత్తపేట వద్ద, సరూర్‌నగర్‌ రైతుబజార్‌ ముందు ఉన్న ఫుట్‌పాత్‌లను సుందరంగా తీర్చిదిద్ది పాదచారులు, ప్రయాణికులు కూర్చునే విధంగా అందమైన కూరగాయల నమూనాలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉల్లిగడ్డ, వంకాయ, గుమ్మడికాయ, ఎల్లిపాయ నమూనాల్లో రుపొందించారు. వీటి ఏర్పాటుతో పుట్‌పాత్‌లకు కొత్త అందాలు వచ్చినట్లయ్యింది. 

 మెట్రో రైలు మార్గంలో..

 మెట్రో రైలు మార్గంలో జాతీయ రహదారికి ఇరువైపులా పుట్‌పాత్‌లను ఆధునీకరించడంతో ఆహ్లాదకరంగా మారాయి. పాదచారులకు అనుకూలంగా కూర్చునే సదుపాయాలు కల్పించడమే గాకుండా ఒక్కో ప్రాంతంలో ఒక్కో థీమ్‌తో ఏర్పాట్లు చేయడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. 


logo