e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home స్పోర్ట్స్ దసరా ధమాకా!

దసరా ధమాకా!

  • నేడు ఐపీఎల్‌ ఫైనల్‌.. టైటిల్‌పై కన్నెసిన చెన్నై, కోల్‌కతా
  • ఈ సీజన్‌లో ఆరింటికి ఆరు మ్యాచ్‌ల్లో చెన్నై ఛేదనలో ప్రత్యర్థులపై గెలిచింది
  • దుబాయ్‌లో గత ఎనిమిది మ్యాచ్‌ల్లో ఛేదనకు దిగిన జట్లు విజయాలు సాధించాయి

ఐపీఎల్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. మాజీ చాంపియన్లు చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే), కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాయి. ప్రత్యర్థులపై అద్భుత విజయాలతో ఫైనల్లోకి దూసుకొచ్చిన చెన్నై, కోల్‌కతా మరోమారు కప్‌ను ముద్దాడేందుకు తహతహలాడుతున్నాయి. రికార్డు స్థాయిలో తొమ్మిదో సారి చెన్నై ఫైనల్లో నిలిస్తే..కోల్‌కతా ముచ్చటగా మూడోసారి అడుగుపెట్టింది. దేశమంతా దసరా పండుగ జరుపుకుంటున్న వేళ ఐపీఎల్‌ ఫైనల్‌ పోరు అభిమానులను అలరించబోతున్నది. దిగ్గజ ధోనీ మ్యాజిక్‌ పనిచేస్తుందా లేక..మోర్గాన్‌ సేన స్పిన్‌ తంత్రం ఫలిస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇంకెందుకు ఆలస్యం దసరా రోజు అసలు సిసలైన ఐపీఎల్‌ మజాను ఆస్వాదించేందుకు సిద్ధమైపోండి.

దుబాయ్‌: ఐపీఎల్‌లో బిగ్‌ఫైట్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా శుక్రవారం చెన్నై, కోల్‌కతా మధ్య ఫైనల్‌ జరుగనుంది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో యూఏఈకి మారిన 14వ సీజన్‌ రెండో దశ అప్పుడే ముగింపు దశకు వచ్చేసింది. గత సీజన్‌లో కనీసం ప్లేఆఫ్స్‌ చేరకుండానే వెనుదిరిగిన చెన్నై..రెట్టించిన ఉత్సాహంతో దూసుకొస్తే కోల్‌కతా పడిలేచిన కెరటంలా వరుస విజయాలు సొంతం చేసుకుంది. లీగ్‌ దశలో గెలిస్తే తప్ప నిలువని పరిస్థితుల్లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఎలిమినేటర్‌లో బెంగళూరును చిత్తుచేసిన కేకేఆర్‌..క్వాలిఫయర్‌-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఉత్కంఠ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు లీగ్‌ ఆఖర్లో హ్యాట్రిక్‌ ఓటములతో ఫైనల్‌-4లో నిలిచిన ధోనీసేన..ఢిల్లీని ఓడించి తొమ్మిదో సారి ఫైనల్లోకి ప్రవేశించింది. సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, షకీబల్‌ హసన్‌ స్పిన్‌ తంత్రంతో చెన్నైకి చెక్‌ పెట్టాలని చూస్తున్న కోల్‌కతా.. మూడోసారి టైటిల్‌ను దక్కించుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. మరోవైపు తన కెప్టెన్సీలో మరోమారు చెన్నైని విజేతగా నిలిపేందుకు ధోనీ సర్వశక్తులు ఒడ్డబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరుగనుంది.

జట్ల అంచనా

- Advertisement -


కోల్‌కతా: మోర్గాన్‌(కెప్టెన్‌), వెంకటేశ్‌ అయ్యర్‌, గిల్‌, రానా, రాహుల్‌ త్రిపాఠి, కార్తీక్‌, షకీబల్‌ హసన్‌, సునీల్‌ నరైన్‌, శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి, ఫెర్గుసన్‌
చెన్నై: ధోనీ(కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌, అలీ, ఊతప్ప, రాయుడు, జడేజా, బ్రావో, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, హాజిల్‌వుడ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement