Nampally Numaish | అబిడ్స్, ఫిబ్రవరి 11 : నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను రెండు రోజులు పొడిగించేందుకు పోలీస్ శాఖ అనుమతించింది. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు కే నిరంజన్, కార్యదర్శి బి సురేందర్ రెడ్డి, సభ్యులు సుఖేష్ రెడ్డి, ధీరజ్ జైస్వాల్‌లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఎగ్జిబిషన్‌ను ఈనెల 17వ తేదీ వరకు పొడిగించేందుకు అనుమతి ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు. వినతిపత్రం స్వీకరించిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ రెండు రోజులు పొడిగింపునకు అనుమతి ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి బి సురేందర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా సెక్రటరీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుండి ప్రారంభమయ్యే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఈ సంవత్సరం మూడవ తేదీ నుంచి ప్రారంభించడం జరిగిందని, దీంతో స్టాల్ యజమానులు ఎగ్జిబిషన్‌ను పొడిగించాలని విన్నవించారని తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు పోలీస్ శాఖ అనుమతి కోసం వినతిపత్రం సమర్పించామని కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్‌రావు బెయిల్ పిటిషన్‌పై వానదలు పూర్తి..
Medchal | పేదల ఇళ్ళపై… పగబట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..!