హైదరాబాద్ : ఈటీవి హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆదినారాయణ(Adinarayana) మృతి చాలా బాధాకరమని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas yadav) విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం మహాప్రస్థానంలో నిర్వహించిన నారాయణ అంత్యక్రియలకు హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ నారాయణ పార్ధీవ దేహానికి నివాళులు(Tribute)అర్పించి సంతాపం తెలిపారు. నారాయణతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. నారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధించారు. కాగా, టి.ఆదినారాయణ అపార్ట్‌మెంట్‌పై వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడగా, కుటుంబసభ్యులు దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.
Amaran | ఇందు రెబెకా వర్గీస్‌గా సాయిపల్లవి.. శివకార్తికేయన్ అమరన్ ఇంట్రో వీడియో వైరల్
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్