మొదట సంక్రాంతి అన్నరు.. తర్వాత మున్సిపల్ ఎన్నికలు అయినంక ఇస్తమని ఆశపెట్టి మొండిచేయి చూపారు. మొన్నటి క్యాబినెట్ మీటింగ్‌లో కూడా చర్చించలేదు. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపేందుకు, పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు వేల కోట్లు ఉంటాయి.. కానీ అన్నం పెట్టే రైతన్నకు ఇచ్చేందుకు డబ్బులు లేవా?
హైదరాబాద్ ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుభరోసా ఇస్తామని మిర్యాలగూడ సభలో ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కోడ్ ముగిసి పది రోజులైనా ఎందుకు జమచేయడం లేదంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాడు ఓట్ల కోసం అబద్ధపు హామీలిచ్చిన రేవంత్‌రెడ్డి, గద్దెనెక్కిన తర్వాత ప్రా ధాన్యతలు మార్చుకున్నారని బుధవారం ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. పెట్టుబడి సాయం అందించకుండా, పండించిన ధా న్యం కొనకుండా, బోనస్ ఇవ్వకుండా రెం డేండ్లుగా అన్నదాతల ఉసురుపోసుకుంటున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎన్నికల ముందు ఎకరానికి రూ.15వేల చొప్పున రైతుభరోసా ఇస్తామని ఆశపెట్టిన కాంగ్రెస్, రెండేండ్ల పాలనలో రెండు సీజన్లకు ఎగనామం పెట్టి రైతాంగాన్ని నిలువునా ముం చిందని మండిపడ్డారు. అదునుకు రైతుభరోసా ఇచ్చేందుకు నిధుల్లేవవి చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మూసీ సుందరీకరణకు వేల కోట్లు, ఈ ప్రాజెక్టులో భా గంగా కూల్చే ఇండ్లకు వేల కోట్లు పంచి పె ట్టేందుకు, మూ సీలో పార్కులు కట్టేందుకు వేల కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయని నిలదీశారు. ఫోర్త్‌సిటీ పేరిట చేపడుతున్న భూసేకరణ, రోడ్ల నిర్మాణానికి వేల కోట్లు ఎక్కడినుంచి తెస్తున్నారని ప్రశ్నించారు.
నాడు ఇనుప కంచెలు లేని ప్రజాపాలన అని గొప్పలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో వందల కోట్లు పెట్టి క్యాంప్ ఆఫీస్ పేరిట ప్యాలెస్ కట్టుకుంటున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. రేవంత్ తీరు చూస్తుంటే ఆయన ఏడో గ్యారెంటీ అయిన ‘ప్రజాస్వామిక పా లన’ ఎంత గొప్పగా వర్ధిల్లుతున్నదో అర్థమవుతున్నదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందాల పోటీలు, ఫుట్‌బాల్ మ్యా చ్‌లకు వందల కోట్లు ఖర్చు పెడుతూ దేశానికి అన్నంపెట్టే అన్నదాత నోట్లో మట్టికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి ఓట్ల కోసం నాటకాలు కట్టిపెట్టి వెంటనే రైతుభరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లే కపోతే తగిన బుద్ధి చెప్పేందుకు రైతాంగం ఎదురుచూస్తున్నదని హెచ్చరించారు.