హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : కుమ్మెర ఘటన అమానుషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు. తన సొంత జిల్లాలోనే శాంతిభద్రతలు కాపాడలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థతను ఎండగట్టారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి నోరు మెదపకపోవడాన్ని దాసోజు తప్పుబట్టారు.
ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. గుడిలోకి ప్రవేశ టికెట్ ఇవ్వలేదన్న సాకుతో ఓ రజక కుటుంబంపై విచక్షణారహితంగా దాడిచేసి, రెండు నెలల పసికందు మరణానికి కారణమవడం మానవ నాగరికతకే మాయనిమచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు.